తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో కరోనా మహమ్మారి తో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా పరిహారం చెల్లించడానికి అవసరం అయ్యే నిధుల ను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా మహమ్మారి తో సంభవించిన ఒక్కో మరణానికి రూ. 50 వేల చొప్పున అందించ డానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు 3,870 మంది కరోనా మహమ్మరి సోకి మరణించారు. వారి కి రూ. 50 వేల చొప్పు న పరిహారం చెల్లించడానికి రూ. 19.35 కోట్ల నిధు ల ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కరోనా మహమ్మారి వల్ల కుటుంబ పెద్ద లు మృతి చెందడం తో కొన్ని కుటుంబాలు రోడ్డు న పడ్డాయి. దీంతో ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగం గా నే ఈ నిధుల ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.