బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అలానే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకి గజ్వేల్ నియోజకవర్గం కేంద్రం లో నిరసన సెగ తగిలింది. గజ్వేల్ లో కార్యకర్తల సమావేశానికి వెళ్లారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అలానే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు.
గజ్వేల్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని అడిగారు ఈ విషయం పై చొరవ చూపించాలని ఆందోళనకారులు కోరారు. ఆందోళనకారులకి హరీష్ రావు నచ్చజెప్పారు. గొడవని ఆపారు. ఇలా గజ్వేల్ లో హరీష్ రావు కి అలానే వెంకటరామిరెడ్డి కి కాస్త గొడవ కారణంగా ఇబ్బంది అయింది. కానీ ఆఖరికి నచ్చజెప్పి వెళ్లారు.