ఈఎస్ఐ స్కామ్ లో మరో సారి మాజీ డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల నాలుగున దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. 6.5 కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించిన ఏసీబీ మరో మారు వీరిని అరెస్ట్ చేసింది. ఎస్ఐ మందుల కొనుగోలులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. దీంతో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు, ఈ స్కామ్ లో మరికొంత మంది మీద కూడా కేసు నమోదు చేశారు.
అయితే వీరిలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి బెయిల్ మంజూరు అయింది. ఆమెతో పాటుగా జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంతలకూ బెయిల్ మంజూరు అయింది. ఈ ముగ్గిరికీ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు సమాచారం. ఇక ఐ ఎం ఎస్ స్కాం లో ఈడి కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. గత గురువారం దేవిక రాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంది ఈడి. పీఎంజే లో 7 కోట్ల కు పైగా విలువ చేసే బంగారం దేవిక రాణీ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. బంజారాహిల్స్ పీఎంజే జువెలర్స్ యాజమానుల స్టేట్మెంట్ ని కూడా ఈడీ రికార్డ్ చేసింది.