సమాజంలో ఎవరి మతాన్ని వారు అభిమానించుకోవాలి..పక్క మతాలని గౌరవించాలి..ఎవరి నమ్మకాలకు వారికి ఉంటాయి. వాటిని దెబ్బతీసే విధంగా సమాజంలో వివాదాలు సృష్టించే వారిని ఉపేక్షించకూడదు. వారికి తగిన గుణపాఠం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు బైరి నరేష్ అనే వ్యక్తికి కూడా అలాంటి తరహా గుణపాఠం ఎదురైందని చెప్పవచ్చు. ఇటీవల అతను అయ్యప్పస్వామిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఇటీవల కొడంగల్ లో హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ, అయ్యప్ప స్వామి పుట్టుకను అవమానిస్తూ, అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేసిన నరేష్‌ని అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అలాగే ఒకానొక సమయంలో నరేష్‌ని వెంటపడి తరిమారు కూడా…అయితే నరేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు..అతని కోసం రెండు రోజుల నుంచి గాలిస్తున్నారు.
ఇదే సమయంలో తాజాగా వరంగల్‌లో పోలీసులకు నరేష్ పట్టుబడ్డాడు. రంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళుతుండగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోలీసులు నరేష్ ఎక్కడున్నారు అన్నది ట్రేస్ చేసి పట్టుకున్నారు. నరేష్‌ను ప్రస్తుతం కొడంగల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ఇప్పటికే నరేష్ పై కొడంగల్ పోలీస్ స్టేషన్ తో పాటుగా, వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
అయితే నాస్తికులుగా ఉండటం తప్పేమీ కాదు..అది వారి వ్యక్తిగతం అలా అని దేవుళ్ళని, ఓ మతాన్ని కించపరిచే హక్కు ఉండదు. నాస్తికుడుగా ఉన్న నరేష్..అయ్యప్ప స్వామిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి..ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి మతాలని గౌరవించుకోవడం, ఎవరిని కించపర్చకుండా ఉండటం అనేది నేర్చుకోవాలి.