తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విపత్కర పరిస్థితుల్లో సజ్జనార్ తో పాటు తనను.. నమ్మకంతో ముఖ్యమంత్రి నియమించారని… ఒకప్పుడు ఆసియాలొనే నెంబర్ వన్ ఉన్న సంస్థ ప్రస్తుత నష్టాల పై ముందుకు వెళతామన్నారు.
రోజుకు 13 కోట్ల ఆదాయం ఉన్న సంస్థ.. ఖర్చు మాత్రం 18 కోట్లు అవుతుందన్నారు.. ఆర్టీసి కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని..ఎండి సజ్జనార్ కష్టపడే వ్యక్తి అని తెలిపారు. ఆయన సహకారం, ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుతామని వెల్లడించారు. ప్రయాణికులు ఆటో ఎక్కి వెళ్తున్నారని.. అది ప్రమాదకరమన్నారు. ఆర్టీసి బస్సు సురక్షితమైనదని.. మేము మాటల్లో కాదు చేసి చూపిస్తామన్నారు. తనకు ఇది పెద్ద ఛాలెంజ్ అని… కేంద్ర ప్రభుత్వ విధానాలు, డీజిల్ పెరుగుదల వల్ల తీవ్ర నష్టాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా.. ఆర్టీసీ ఎండీ ఇటీవలే సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.