తన 60వ జన్మదినం సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు బర్త్‌డేకి ఒక రోజు ముందే స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయనే స్వయంగా పాడిన ఓ స్పెషల్ సాంగ్‌ను జూన్ 9 సాయంత్రం 5:03 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రస్తుతం బోయపాటితో బాలయ్య చేస్తున్న సినిమాకు సంబంధించి కూడా ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారని సమాచారం.