బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్‌పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి 1.50 లక్షలు లంచం తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. వైద్య పరీక్షల కోసం సుజాతను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. కాగా బంజారాహిల్స్ రూ.40 కోట్ల రూపాయల భూ వ్యవహారంలో సుజాతను అధికారులు విచారించారు.