ఉద్యోగాల భర్తీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేశామని.. నూతన జోన్ల ఆమోదం తర్వాత క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ రూపొందించామని కేసీఆర్ తెలిపారు.
భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయని…అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణ అని… వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండడం వెనక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఉందని వెల్లడించారు.
పారిశ్రామిక, వాణిజ్యం, ఐటి రంగాలు సహా వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని.. లక్షలాదిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరుగుందన్నారు కేసీఆర్. కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపిన ఆయన… ఐటి సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్జాన అకాడెమీ (టాస్క్)ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.