తిత్లీకి బాల‌కృష్ణ 25 ల‌క్ష‌ల సాయం

-

balakrishna donates huge for titli cyclone
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తితలీ తుపానుతో కోలుకోని దెబ్బతిన్న సిక్కోలును ఆదుకునేందుకు ముందుకొచ్చారు. రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుతున్నట్లు తెలిపారు. తుపాను తీవ్రతతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే కార్తీకేయ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news