బాలయ్య కలెక్షన్స్ చుట్ట గట్టిగానే వెలుగుతోంది..!!

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడిచింది. మొదటి రోజు నుండే వసూళ్ళు కూడా అనుకున్నట్టే అదరగొట్టాయి.

మరో వైపు ఈ సినిమా లోని డైలాగ్స్ పై ప్రభుత్వం కూడా ఒక కన్ను వేసింది. ఇది కలకలం రేపింది. ఇక ఈ సినిమా వసూళ్ళు చూసుకుంటే కొద్దిగా చిరంజీవి సినిమా ఉండటం వల్ల కొంచం తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాక పోతే సీడెడ్ కొన్ని చోట్ల బాలయ్య బాబు కలెక్షన్స్ చుట్ట గట్టిగానే వెలుగుతూ ఉంది. అక్కడ బాలయ్య బాబు చిరంజీవి కూడా బీట్ చేసినట్లు కనపడుతోంది.

బాలయ్య బాబు వీర సింహ రెడ్డి తెలంగాణ, ఏపీ లలో . 18 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 68.52 కోట్లు (రూ.111.20 కోట్లు గ్రాస్)గా ఉంది. కర్ణాటక ప్లస్ ఇతర ప్రాంతాలు రూ.4.81 కోట్లు ఓవర్సీస్ రూ. 5.76 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 18 రోజులు కలిపి చూస్తే.. రూ. 73 కోట్లు షేర్ (రూ. 132.30 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయి.సినిమా మెుత్తం మీద.. 18 రోజులలో  5.09 కోట్ల ప్రాఫిట్ పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news