ఆహా వీడియో యాప్ లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమం రికార్డులు సృష్టిస్తోంది. అయితే.. గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక సీజన్ విజయవంతంగా పూర్తి కాగా రెండవ సీజన్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. తాజాగా ఈ సీజన్ కి సంబంధించిన చివరి ఎపిసోడ్ గా చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ఆహా యాజమాన్యం ప్రకటించింది.ఇక తాజాగా ఈ మేరకు మరో అప్డేట్ కూడా ఇచ్చేసింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది ఆహా టీం. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌లో నవ్విన సన్నివేశాలను జోడించి రిలీజ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 3వ తేదీన పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగం స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ అప్డేట్ ఇచ్చింది. మాటల్లో రోషం, మీసంలో పౌరుషం, ఆ కటౌట్ లో రాజసం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ అఫియరెన్స్ కి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి మూడో తేదీన మొదటి ఎపిసోడ్ మీ ముందుకు రాబోతోంది అంటూ ఆహా వీడియో ప్రకటించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్ మీద అందరిలోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి.