విజయవాడకు బయలుదేరిన బాలకృష్ణ …

టీడీపీ అధినేత మరియు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో టీడీపీ నేతలు నిరసనలు తెలియచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో టిడిపి అధికారంలోకి ఈ దగ స్కిల్ డెవలప్ మెంట్ పేరు మీద నిధులు దోచారన్న కారణంతో అరెస్ట్ జరిగింది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు ను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా నారా లోకేష్ చంద్రబాబు ను కలుసుకోవడానికి సిట్ కార్యాలయానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక అరెస్ట్ అయినా చంద్రబాబును కలుసుకోవడానికి హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంధమూరి బాలకృష్ణ హుటాహుటిన హైదరాబాద్ నుండి బయలు దేరి విజయవాడలో వస్తున్నారు. బాలకృష్ణ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో విజయవాడను రానున్నారు.

అంతకు ముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ఎఫ్ ఐ ఆర్ లో బాబు పేరు లేకపోయినా సీఎం జగన్ అరెస్ట్ చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇక ముందు ముందు ఈ కేసులో ఏమి తెలియనుంది అనేది చూడాలి.