చంద్రబాబుపై ప్రశ్నల వర్షం..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు. ఇవాళ ఉదయం నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నా పోలీసులు.. సుమారు తొమ్మిది గంటల ప్రయాణం అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు.

Naidu asked to vacate 'illegal' riverbank home in Vijayawada | Mint

ఇవాళ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడ సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించిన అధికారులు.. చంద్రబాబును విచారిస్తున్నారు. విజయవాడలోని సీఐడీ ఆఫీస్ లో చంద్రబాబును సుమారు గంట నుంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బాబు చెబుతున్న సమాధానాలను రికార్డ్ చేస్తున్నారు. మొత్తం గంటన్నర పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత బాబును GGHకు తరలించి వైద్య పరీక్షలు చేస్తారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు.