BALAYYA : బీచ్‌లో భార్యతో బాలయ్య ఫుల్‌ ఎంజాయ్‌..వీడియో వైరల్‌

-

సంక్రాంతి పండుగ వేడుకలను తన కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా హిందూపురం టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలయ్య జరుపుకుంటున్నారు. పండున నేపథ్యంలో… తన సోదరి పురంధరేశ్వరి సొంతూరు కారంచేడుకు బాలయ్య కుటుంబం వెళ్లింది. ఇక అక్కడ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తుంది బాలయ్య కుటుంబం.

నిన్న గుర్రం ఎక్కి సందడి చేసిన నందమూరి బాలయ్య… తాజాగా తన భార్య వసుంధరతో కలిసి.. జీప్‌ లో తిరిగిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. భార్యను పక్కన కూర్చో బెట్టుకుని.. ఆయన స్వయంగా జీప్‌ నడిపారు. టాప్‌ లెస్‌ ఫోర్డ్‌ జీప్‌ లో కాసేపు అక్కడ తిరిగి, అనంతరం కుటుంబ సభ్యులతో బీచ్‌ లో కాసేపు గడిపారు బాలయ్య. ఇక ఈ వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ గా మారింది. కాగా.. ఇటీవల నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా బంపర్‌ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news