ట్రోలర్స్ కి చిక్కిన బాలయ్య..మారవా అంటూ..!!

-

నరసింహం బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే తాజాగా ఈయన హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాను తన కుటుంబంతో కలిసి వీక్షించడం జరిగింది. సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాతో మాట్లాడారు బాలయ్య.. ఇక అంతేకాదు అటు కళ్యాణ్ రామ్ ను ఇటు డైరెక్టర్ వశిష్ట ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుంది కచ్చితంగా పైకి వస్తారు అంటూ వారిని మెచ్చుకోవడం జరిగింది.. ఇదంతా బాగున్నప్పటికీ డైరెక్టర్ వశిష్ట ను ఉద్దేశించి.. నీతో తప్పకుండా ఒక మూవీ చేస్తాను.. సాధారణంగా చాలామంది చిన్న చిన్న చిత్రాలు చేసిన తర్వాత పెద్ద చిత్రాలు చేస్తారు. కానీ నువ్వు డెబ్యూ మూవీతోనే పెద్ద చిత్రం చేశావు.. సాధారణంగా నీకు అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ రామ్ చాలా గొప్పవాడు.. నందమూరి ఫ్యామిలీ అంటే ఎప్పుడైనా మేమే కొత్త టాలెంట్ ని ఆదరిస్తాం.

బింబిసారా మూవీతో ఎన్టీ రామారావు ఒరవడిని కొనసాగించారు. ఇండస్ట్రీలో ఆయనతోనే ఏదైనా ప్రారంభమైంది.. ఏదైనా మాతోనే ప్రారంభం కావాల్సిందే అంటూ మరొకసారి తన కుటుంబాన్ని వీర లెవెల్లో హైలెట్ చేశారు బాలయ్య. ఇక పోతే బాలకృష్ణ తమను తాము పొగుడుకుంటే పర్లేదు కానీ కొన్ని సందర్భాలలో ఇతరులను ఉద్దేశించి కూడా దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు..ఇక రాజకీయ విషయానికి వస్తే.. సక్సెస్ కావడం గురించి మాట్లాడుతూ.. మా బ్లడ్ వేరు.. మా ఆలోచన వేరు.. అమితాబ్, చిరంజీవి లాంటి వాళ్ళు ఎన్టీఆర్ లాగా పాలిటిక్స్ లో సక్సెస్ కావాలని భావించి తీవ్రంగా ఫెయిల్ అయ్యారని బాలయ్య ఎగతాళి చేయడం కొన్ని సందర్భాల్లో విమర్శలకు దారి తీసింది.

ఇక అంతే కాదు బాలయ్య చేసిన కొన్ని కామెంట్స్ 2019 ఎన్నికలకు ముందు నాగబాబు ఒక సీరియస్ వీడియో తీసి తీవ్రంగా విమర్శించాడు.. ఇక మళ్ళీ ఈ విధంగా ప్రవర్తించి తమ కుటుంబం గొప్పలు చెప్పుకోవడంతో ట్రోలర్స్ చేతికి చిక్కాడు బాలయ్య.. అంతేకాదు మీరు మారరా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఈ విషయంపై బాలయ్య ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news