కార్యకర్తలు ఎవరు అధైర్య పడద్దని.. ఈనెల 20న మునుగోడు కి వస్తున్నానని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకుల కొనుగోలికి తెరలేపారని మండిపడ్డారు. కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు అడ్డగా మార్చేస్తున్నారని.. సర్పంచ్ ,ఎంపీటీసీలను కొనుగోలు చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఫిరాయింపుల ప్రయోగశాలుగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల రేవంత్ రెడ్డికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. అయితే కరోనాతో అక్కడికి రావడం కొంత ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. 8 ఏళ్లు ప్రభుత్వంతో కొట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తప్పటడుగులు వెయ్యకండి అంటూ సూచించారు. వచ్చేది మన ప్రభుత్వమేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే అవకాశం వచ్చిందని.. ఎవరి బెదిరింపులకు భయపడకండి అని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలబడదాం.. కాంగ్రెస్ ని గెలిపించుకుందామన్నారు.