అధికారం కోసం ఎంత ఆకలితో ఉన్నారో తెలంగాణకు తెలుసని తక్షణమే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. రేవంత్ రెడ్డి కి ఏ నోటీసులు రాలేదని రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నాడని కేటీఆర్ అన్న మాటలకి వెంకట్ స్పందించారు అందుకు సంబంధించి ఆధారాలు చూపిస్తూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు రాసిన పేపర్ క్లిప్ మీకు కనిపిస్తుందని సూచించారు అబద్దాలని ఉమ్ము వేసే సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అంతేకాక ఆ సమాచారాన్ని ధ్రువీకరించండి అని అన్నారు. అధికారం కోసం అంత ఆరాటపడద్దు మీరు అధికారం కోసం ఎంత ఆకలితో ఉన్నారో తెలంగాణ మొత్తానికి తెలుసు అని తప్పుడు ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.