ఏపీలో 87 శాతం పేదలకు పథకాలు అందాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాజాగా వైసీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి మేనిఫెస్టోను చేరవేయాలని నిర్ణయించింది. జగన్ కోసం సిద్ధం అనే పేరుతో బూత్ సభ్యులు ప్రతీ ఇంటికి వెళ్లి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ఓటర్లకు వివరిస్తానని తెలిపారు సజ్జల. ఇవాళ్టి నుంచే నియోజకవర్గాల్లో ప్రారంభించామని వివరించారు.
2019-24 మధ్య అమలు చేసిన సంక్షేమం.. ఈ దఫా అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారో వాటిని వివరిస్తారు. ఇవాల్టి నుంచే అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి ఈ కార్యక్రమం నడుస్తుంది.
ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతుందనేది తెలియజేసేందుకు క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ చేరవేస్తాం. చంద్రబాబులాగా మేనిఫెస్టోను పక్కన పడే విధంగా కాకుండా.. రికార్డెడ్ గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోతే నిలదీసే” హక్కు ప్రజలకు ఉంటుందని సజ్జల ఈ సందర్భంగా అన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశాం. వివిధ సామాజిక వర్గాల నుంచి వీళ్లను ఎంపిక చేసి ఈసీకి అందజేశాం.