చార్‌ ధామ్‌ లో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం

-

చార్‌ ధామ్‌ యాత్ర లో ఇకపై వీడియోలు, రీల్స్‌ చిత్రీకరణను నిషేధిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్‌ చేయడం భక్తులకు ఇబ్బందిగా మారిందని, వారి మత విశ్వాసాలను దెబ్బతీస్తోందని ఆమె తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా పాటలకు నృత్యాలు చేస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలువురు భక్తుల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని రాధా రాటూరి తెలిపారు. ఇకపై ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని తెలిపారు.

చార్ ధామ్ యాత్రకు దేశ, విదేశాల నుంచి 26 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. హరిద్వార్‌, రిషికేశ్‌లకు గతేడాదికంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తున్నారని కమిషనర్‌ వినయ్‌శంకర్‌ పాండే వెల్లడించారు.కాగా, యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రలతో కూడిన చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news