అరటిపండు తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే అవాక్ అవ్వాల్సిందే…!

-

అరటిపండు వల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. అరటి పండు నిజంగా ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది అని మనకి తెలిసిన సంగతే. కానీ అరటి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడు విని ఉండరు. మరి ఇప్పుడే తెలుసుకోండి. మనం పాడేసే ఈ అరటి తొక్కలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అరటి తొక్క దంతాల సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే దీని కోసం ఏం చెయ్యాలంటే..? ముందు తొక్క లోపలి భాగాన్ని తీసుకోవాలి. దానిని దంతాలపై రోజూ రుద్దాలి. ఇదే పద్ధతిని కనుక ఒక పది రోజుల పాటు చేస్తే మీ దంతాలు మెరిసిపోతాయి.

చర్మంపై దురదలు, మంటలు కనుక వస్తే వాటిని తగ్గించడానికి అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది. ఇటువంటి సమస్య మీకు ఏది ఉన్న ఆ ప్రదేశంపై అరటి పండు తొక్కను రాసి 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద, మంట తగ్గిపోతుంది. అలానే అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అరగంట సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.

యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అరటి పండు తొక్కలో ఉన్నాయి. అంతేకాదు దీని వల్ల వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతమవుతుంది. పురుగులు, కీటకాలు కుట్టిన చోట దురదగా ఉన్నా అరటి పండు తొక్కను రాస్తే చాలు. వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు శరీరం లో ఏదైనా భాగం నొప్పిగా ఉంటే అక్కడ అరటి పండు తొక్కను కొద్ది సేపు మసాజ్ చేసినట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news