సీఎం పదవికీ రాజీనామా చేస్తావా : కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని వద్దకు పోయి నిధుల సంగతి తేలుద్దామా ?అని సీఎం కేసీఆర్‌ చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని… తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా ? అని…సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు.

బీజేపీ – టీఆర్ఎస్ పొత్తు పై కాంగ్రెస్ ది దుష్ప్రచారమని నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కి కెప్టెన్ కేసీఆర్, వైస్ కెప్టెన్ ఎంఐఎం, కాంగ్రెసోళ్లు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని ఎద్దేవా చేశారు బండి సంజయ్‌. విమోచన దినం రోజున జెండా ఎగురవేయని కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని… తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం గా కొనసాగే అర్హత లేదని… కేసీఆర్ ఒక అహంకారి అని మండిపడ్డారు. ప్రతి ధాన్యం గింజ కొంటానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని… రైతులు లక్షాధికారులు కావడం మాటెమోగాని కేసీఆర్ మాత్రం కోటీశ్వరుడయ్యాడని మండిపడ్డారు.