కేసీఆర్ ఫ్యామిలీ మీద బండి సంజయ్ సంచలన ఆరోపణలు..!

-

కేసీఆర్ ఫ్యామిలీ మీద బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 500 కోట్ల భూదాన్ భూములను కేసీఆర్ కుటుంబం స్వాహా చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ భూదాన్ భూములను స్కాంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దానిని పోర్టల్ బాధితుల తో సమావేశం పెడితే హైదరాబాద్లో జింఖానా క్రికెట్ గ్రౌండ్ కూడా సరిపోదని బండి సంజయ్ సెటైర్లు వేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని చెప్పారు. బీఆర్ఎస్ భూములు మింగడానికి ధరణి పోటోలు తీసుకొచ్చిందని తీవ్ర ఆరోపణలని చేసారు. భూముల మీద తను కూడా 15 రోజుల నుండి ఆధారాలని సేకరిస్తున్నానని బండి అన్నారు కాలేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version