కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి.. ఇదే నిదర్శనం : బండి సంజయ్‌

ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు.. మహిళా బిల్లు విషయంలో బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్… మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం పట్ల సంతోషంగా ఉందని బండి సంజయ్‌ అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు 5 దశాబ్దాల నాటిది.. 1975 లోనే లోక్ సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడం దురదృష్టకరమని బండి సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay: ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం హర్షణీయం | BJP Leader Bandi  Sanjay Karimnagar Telangana Suchi

అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998 జూలైలో తొలిసారిగా మహిళా బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ.. కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు వ్యతిరేకించడంతో ఆమోదం పొందలేదు అని బండి సంజయ్ అన్నారు. ఆ తరువాత వాజ్ పేయి ప్రభుత్వం మరో మూడు సార్లు మహిళా బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేసిన కుట్రల వల్ల ఆమోదానికి నోచుకోలేక పోయిందన్నాడు బండి సంజయ్. యూపీఏ ఛైర్ పర్సన్ గా పదేళ్ల పాటు పని చేసిన సోనియా గాంధీ మహిళ అయినప్పటికీ పార్లమెంట్లో యూపీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఆమోదించలేక పోయారంటే కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.