రూ.3 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసిన బండి సంజయ్

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదివారం రోజున తన 50వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెల్సిందే. తన పుట్టిన రోజును పురస్కరించుకుని బండి సంజయ్ పలు ఆరోగ్య సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన రూ.3 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. వీటిలో 4 అంబులెన్సులతోపాటు పెద్ద సంఖ్యలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్లు, వెంటిలేటర్లు, సీపాక్, అనెస్తెషియా, సీటీజీ, ల్యాప్రోస్కోప్, ఫీటల్ డాప్లర్, బయోకెమిస్ట్రీ, కోవిడ్ ప్రొఫైల్ మెషన్లు మొదలైనవి ఉన్నాయి.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జిల్లా ప్రధాన ఆసుపత్రితోపాటు వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ అంబులెన్సులను అందజేశారు. ఐసీయూలో ఉండాల్సిన పరికరాలన్నీ ఈ అంబులెన్సులలో సమకూర్చడం విశేషం. పార్లమెంట్ పరిధిలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు ఫెటల్ డాప్లర్ లను, బయోకెమిస్ట్రీ, కోవిడ్ ప్రొఫైల్ సిరంజ్, ఇంఫుజిన్ పంప్స్, సిరంజి పంప్స్, సీపాప్, హెస్టెరోస్కోప్ విత్ హైడ్రోజెట్ మెషిన్లతోపాటు వెంటిలేటర్స్ ను అందజేశారు. కోవిడ్ వల్ల ఎవరూ ఆక్సిజన్ కు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో అవసరమైన వారందరికీ ఎంపీ కార్యాలయంలో ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. అవసరమైన వారికి వీటిని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో పార్లమెంట్ పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గ ఆసుపత్రులకు కూడా అంబులెన్సులను అందజేస్తామని ఆయన వెల్లడించారు.

అలానే తన పుట్టిన రోజున బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలకు భరోసా కల్పించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 5 వేల మంది బీజేపీ కార్యకర్తలు, యువకులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా పథకాన్ని వర్తింప జేస్తున్నట్లు ప్రకటించారు. పుట్టిన రోజు నాడే వెయ్యి మంది కార్యకర్తలకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లించారు. మరికొద్ది రోజుల్లో మిగిలిన వారందరి జాబితా సేకరించి ప్రీమియం చెల్లిస్తున్నట్లు తెలిపారు. తాను ఎంపీగా కొనసాగినంత కాలం కార్యకర్తల బీమా ప్రీమియాన్ని తానే చెల్లిస్తానని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news