రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మొత్తం 34 మంది ఆపరేషన్ చేయించుకోగా.. నలుగురు మరణించారు. ఈ ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ఘటనలో నలుగురు మరణించడం దేశంలోనే పెద్ద సంఘటన అన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు.
అసలు ప్రభుత్వానికి మానవత్వమే లేదన్నారు బండి సంజయ్. హెల్త్ డైరెక్టర్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఈ రాష్ట్రంలో ఇంకెవరి మీద లేవన్నారు. డిప్యూటేషన్, ప్రమోషన్స్, బదిలీలకు డబ్బులు వసూలు చేస్తూ.. సంబంధిత మంత్రికి నెల నెల మూటలు అప్పగిస్తాడనిని ఆరోపించారు. తెలంగాణలో పేద ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం.. నీ అల్లుడిని భర్తరఫ్ చెయ్.. అలాగే హెల్త్ డైరెక్టర్ ని సస్పెండ్ చెయ్ అంటూ డిమాండ్ చేశారు.