మా తప్పు లేకపోయినా మమ్మల్ని అంటారా…? కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం

గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం ఇప్పుడు వివాదం అయింది. వరద సాయాన్ని బిజెపి నేతలు అడ్డుకున్నారు అని సిఎం కేసీఆర్ నిన్న సాయంత్రం ఆరోపణలు చేయడం సంచలనం అయింది. దీనిపై తీవ్ర ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతోనే వరధ సాయం నిలిపివేశారు అని ఆయన ఆరోపించారు. అయితే ఇందులో మా తప్పు లేదని బిజెపి అంటుంది.

bandi sanjay
bandi sanjay

తమను ఆరోపించినందుకు బండి సంజయ్ ఫైర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని అన్ని డివిజన్లలో నేడు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలని బీజేపీ యువ మోర్చా పిలుపునిచ్చింది. వరద సాయాన్ని బీజేపీ ఆపించిందని సీఎం ఆరోపణలకు నిరసనగా నేడు బీజేపీ యువ మోర్చా ఆందోళన కార్యక్రమం చేస్తుంది.