బండి సంజయ్ కి వెంట్రుకలే కాదు మెదడు కూడా లేదు – మంత్రి ఎర్రబెల్లి

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వెంట్రుకలే కాదు.. మెదడు కూడా లేదని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హనుమకొండలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల రాజకీయంలో ఇంత పెద్ద సభ ఎక్కడ చూడలేదు అన్నారు. ఖమ్మం బహిరంగ సభ విజయవంతం అయిందన్నారు ఎర్రబెల్లి.

ప్రధాని మోడీది తెలంగాణపై సవతి తల్లి ప్రేమ అని మండిపడ్డారు. బిజెపి వాళ్లు కాంగ్రెస్ ను లేకుండా చేయాలని చూస్తున్నారని.. రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్ గురించి ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని మెచ్చుకుంది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలోని పథకాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకుంటున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news