ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పై గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్ల పాలనలో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని మండిపడ్డారు. తెలంగాణ విభజన సమయంలో 1000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు.
ఖమ్మం సభ అట్టర్ ప్లాప్ అన్నారు షబ్బీర్ అలీ. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ మీటింగులు ఏంటని ప్రశ్నించారు. విద్యుత్ ఎసిడి చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు ఒక కంటి ఆసుపత్రి ఏర్పాటు చేస్తే 365 రోజులు పేదలకు అందుబాటులో ఉంటుందన్నారు. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు షబ్బీర్ అలీ.