కేసీఆర్ రాజకీయ పతనం మొదలైందని జ్యోతిష్యుడు చెప్పాడు : బండి సంజయ్

అధికార టిఆర్ఎస్ పార్టీ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఛీత్కరించిన పరవాలేదు బీజేపీ ని బ్లెమ్ చేయాలని తెగించాడని.. కేసీఆర్ కు రాజకీయ పతనం ప్రారంభం అయిందని ఆయన జ్యోతిస్కుడు ఆయనకు చెప్పాడు అంట అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్. కేసీఆర్ కు రాజకీయ పతనం ప్రారంభం అయిందని.. తెలంగాణ మంచి రోజులు రాబోతున్నాయని జ్యోతిస్కుడు నాకు చెప్పారన్నారు.

నియంత, అవినీతి, కుటుంబ  పాలనను తెలంగాణ ప్రజలు సహించరని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక అదే నిరూపించిందని పేర్కొన్నారు. బీజేపీ ని బద్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు… ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ డిల్లీ టూర్ అంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్.రక్తం దారబోసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని.. సీఎం కుటుంబం లో కొట్లాట మొదలైంది…. నన్ను సీఎం ని ఎప్పుడు చేస్తావని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. 2023 లో తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని.. ఈ వేదిక మీద ఉన్న ఎవరు సీఎం అయిన అర్హులైన పేదలకు విద్యా, వైద్యం ఫ్రీ .. నేను హామీ ఇస్తున్నానని చెప్పారు.