తుకుడే గ్యాంగ్ కు గుణపాఠం…”మా” ఎన్నికలపై బండి సంజయ్ సంచలనం..!

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు ఆయనను అభినందిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ విష్ణు ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. “మా” అధ్యక్షుడిగా గెలిచిన మంచు సహా ఇరు ప్యానెల్ ల లోని విజేతలందరికి శుభాకాంక్షలు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన “మా” ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

“మా” ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. “మా” ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు. భారత్ మాతాకి జై !” అంటూ సంఖ్య ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మా ఎన్నికలపై రాజకీయాల ప్రభావం ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యం లో బండి సంజయ్ ట్వీట్ సంచలనం గా మారింది.