Allu Arjun-Sukumar: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పిచ్చెకించే న్యూస్‌..! మ‌రోసారి బ‌న్నీ, సుకులా కాంబీనేషన్‌.. ఆ సిరీస్‌కు ప్లాన్‌!

-

Allu Arjun-Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్క‌ల మాస్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌ ల క్రేజీ కాంబినేష‌న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య, ఆర్య‌2 చిత్రాలకు ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి ఆద‌ర‌ణ వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. ఆర్య సీరిస్‌కు అభిమానులు నీరాజనాలు పడ్డారు. ఇప్పుడీ సిరీస్‌కి కొనసాగింపుగా ‘ఆర్య3’ తీసుకురానున్నట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు.

తాజాగా సుకుమార్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా త‌న అభిమానులతో ముచ్చ‌టించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ”ఆర్య 3′ ఉంటుందా?” అని ప్రశ్నించగా.. కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఆర్య 3 స్క్రిప్ట్ సిద్ధం అవుతోంద‌ని చెప్పారు. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలు ఎక్కే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్పారు.

ఆర్య‌, ఆర్య‌2 సినిమాల‌కు సంగీతం అందించిన దేవి శ్రీ ప్ర‌సాదే ఆర్య 3 కి సంగీతం అందించారని తెలిపారు. ఈ అప్డేట్ తో ప్రేక్ష‌కుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అలాగే.. పుష్ఫ అప్డేట్ గురించికూడా తెలిపారు. పుష్ప: ది రైజ్‌’ విడుదల తేదీలో ఎలాంటి మార్పుల్లేవ‌నీ, డిసెంబరు 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలియజేశారు.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ పుష్ప సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో సునీల్ కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news