బిజెపి భిక్ష వల్లే నీకు సీఎం పదవి వచ్చిందని కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫాల్తు రాజకీయ నేతలు, పార్టీ లు ఇక్కడ ఎందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలు అని అడుగుతున్నారు…కెసిఆర్ నీ సంగతి చెప్పేందుకే ఇక్కడ బిజెపి సమావేశాలు అని స్పష్టం చేశారు. తెలంగాణ కు మొదటి ద్రోహి కెసిఆర్ అని… తెలంగాణ పాకిస్తాన్ లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా,లండన్ లో ఉందా అని నిలదీశారు.
బిజెపి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యే వాడివా.. బిజెపి భిక్ష నీకు సీఎం పదవి అంటూ ఫైర్ అయ్యారు. 12 వందల త్యాగాల ఫలితంగా తెలంగాణ వస్తే.. ఈ రోజు నీ కుటుంబం పాలన చేస్తుందని మండిపడ్డారు..ఉఫ్ అంటే కొట్టుకు పోయే పార్టీ నీది…అతీగతీ లేని పార్టీ నీది అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టిన రోజు ఎక్కడ తాగి పన్నావో నీవు నీ కుటుంబం సమాధానం చెప్పాలని.. నీ అయ్య చిట్టా మొత్తం విప్పుతానని హెచ్చరించారు.