మజ్లీస్ ను నామరూపాలు లేకుండా చేస్తాం : బండి సంజయ్

కామారెడ్డి : ఎంఐఎం గుండాల అరాచకాలు పెరిగిపోయాయని.. మజ్లీస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఉద్యమం పేరుతో టిఆర్ఎస్ నేతలు నీరుగార్చారని.. పేదల ఆత్మ బలి దానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు.

bandi sanjay kumar aimim party

కర సేవకుల బలిదానాలతోనే అయోధ్యలో రామమందిరం అవుతోందని.. కేసీఆర్ మూర్ఖపు విధానాలతో రైతులు చెరుకు సాగు మానేశారని మండిపడ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాలని.. వరిసాగు పై రైతులకు భరోసా కల్పించాలన్నారు. మొక్క జొన్నలు కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌజ్ ను ముట్టడిస్తానని.. సీఎం మెడలు వంచి మొక్కజొన్న లను కొనిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్ ఛాలెంజి లను లేవనెత్తారని.. సవాల్లన్ని కాంగ్రెస్ టిఆర్ఎస్ ల డ్రామా లేనని ఆరోపణలు చేశారు బండి సంజయ్. తెలంగాణ లో అధికారం లోకి వచ్చి తీరుతామని పేర్కొన్నారు.