బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే సీతక్క

తెలంగాణ కాంగ్రెస్ నేత, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర అస్వస్థత కు గురైంది. నిన్న రాత్రి నుంచి…. అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే సీతక్క… ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సీతక్క బిపి ఒక్కసారిగా తగ్గిపోయింది.

దీంతో ములుగు నియోజకవర్గం లోని ఏటూరు నాగారం ఆస్పత్రికి ఎమ్మెల్యే సీతక్క… ఆమె అనుచరులు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క ఏటూరు నాగారం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీతక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఎమ్మెల్యే సీతక్క ఆరోగ్యంపై తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం అందుతోంది. కాగా… ములుగు నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే సీతక్క… కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రజలకు అనేక రకాలుగా సేవలు చేశారు. అలాగే… ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంటారు ఎమ్మెల్యే సీతక్క.