సైబరాబాద్ కమిషనర్‌కు మరోసారి చాలెంజ్ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్. సైబరాబాద్ పరిధిలో పోలీస్ స్టేషన్ల ముందు నుంచి అక్రమంగా ఆవుల్ని వధించడానికి తీసుకెళ్తున్నారా? లేదా? ఈ నివేదిక తెచ్చుకోవాలని సజ్జనార్‌కు సూచించారు. అందులో తేలిన నిజానిజాలను బట్టి నాపైనా లేదా పోలీసులపై చర్యలు తీసుకోండని చెప్పారు. గోవుల్ని తరలిస్తున్న వాహనాలను.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. గతంలో సైబరాబాద్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు కార్యకర్తలు ఓ బండిని పట్టుకుని తీసుకుని వెళ్తే దూషించారా? లేదా? అని అడిగారు. వారిపై రౌడీషీట్ తెరుస్తామని వార్నింగ్ ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్నించారు రాజాసింగ్.
ఇక ఈ కామెంట్స్ విషయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అండగా నిలిచారు. రాజా సింగ్ కి కేసులు కొత్త కాదన్న ఆయన దమ్ముంటే కేసు పెట్టుకోండని సవాల్ విసిరారు. మేము పోలీస్ వ్యవస్థ కి వ్యతిరేకం కాదు.. కొందరు పోలీస్ లకు వ్యతిరేకమని ఆయన అన్నారు. Ips అధికారులు గోవధకు, గోవుల తరలింపుకు సహకరిస్తున్నారని 2023 వరకు ఎప్పుడు పోతుందో తెలియని ఈ ప్రభుత్వం కి వత్తాసు పలకడం మానుకోవాలని అన్నారు. రాజా సింగ్ అడిగిన ప్రశ్నలకు ఎందుకు స్పందించరు ? టీఆర్ఎస్ ఆందోళన చేస్తే సహకరిస్తారు.. మేము చేస్తే లాఠీ ఛార్జ్ లు చేస్తారు ? అని ఆయన ప్రశ్నించారు.