తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం వలన రాజకీయ పార్టీల దూకుడు ఎక్కువైంది అని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న BRS దేశరాజకీయలలో కూడా కీలక పాత్ర పోషించాలని తహతహలాడుతోంది. కానీ బీజేపీ చెబుతోంది ఏమిటంటే… ముందు తెలంగాణలో అధికారాన్ని ఎలా నిలుపుకోవాలో ఆలోచించు అంటూ సేటైర్లు వేస్తున్నారు.
నిన్న ములుగు లో నిర్వహించిన పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నీ ఓడించడానికి కాంగ్రెస్, BRS మరియు ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కలిసి వచ్చినా మోదీ నాయకత్వం ముందు బలాదూర్ అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై BRS నాయకులు కౌంటర్ కు ఇస్తున్నా… సర్వేల ప్రకారం BRS ఓటమి సాద్యపడే విషయం కాకపోయినప్పటికీ వ్యతిరేకత మాత్రం తీవ్ర స్థాయిలో ఉందన్న మాట వాస్తవం.. ఆ ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికలు హోరా హోరీగా జరగనున్నాయి అన్న మాట మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.