హీరోగా అవతారమెత్తనున్న బండ్ల గణేష్

-

భారీ సినిమాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా మారబోతున్నారు. ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వెంకట చంద్రన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ…. ఎస్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… “బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలరని ఆయనను సంప్రదించాం. ఆయన ఓకే చెప్పడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో… ఆర్ పార్తి బన్ హీరోగా నటించడంతో పాటు… దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా “ఒత్తు సెరుప్పు సైజ్ 7″రీమేక్ ఇది. పార్తిబన్ గారికి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి.‌ సెప్టెంబర్ తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం” అని చెప్పారు.  కాగా ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌

Read more RELATED
Recommended to you

Latest news