పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్. కరెంట్ బిల్ కట్టేవారికి క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. ఇటీవల గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కరెంట్ బిల్లులపైనా పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎంతో కరెంట్ బిల్ చెల్లిస్తే రూ.50 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే, ఇది మొదటిసారి కట్టేవారికి. ఇప్పటికే కరెంట్ బిల్స్ చెల్లిస్తున్నవారికి రివార్డ్స్ కూడా లభిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ పేటీఎం ద్వారా చెల్లించొచ్చు.
పేటీఎం యాప్ ద్వారా కేవలం నిమిషంలోపే కరెంట్ బిల్ చెల్లించొచ్చు. పేటీఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత రాష్ట్రం పేరు ఎంచుకుని, ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడర్ పేరు సెలెక్ట్ చేయాలి. కస్టమర్ బిల్ నెంబర్ ఎంటర్ చేస్తే చెల్లించాల్సిన బిల్లు వివరాలు వస్తాయి. ఓసారి వివరాలన్నీ సరిచూసుకొని పేమెంట్ చేయాలి. బిల్ పేమెంట్ చేయడానికి పేటీఎం యూపీఐ, పేటీఎం వ్యాలెట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. రిసిప్ట్ జనరేట్ అవుతుంది. అంతేకాదు ఒకసారి పేటీఎంలో కరెంట్ బిల్ చెల్లిస్తే ఆ తర్వాత చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించిన ఇన్ యాప్ నోటిఫికేషన్ వస్తుంటాయి.