పవన్ ఫాన్స్ కి బండ్ల గణేష్ క్షమాపణలు..!?

-

పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రస్తుతం నిర్మాత నటుడు కమెడియన్ అయిన బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. సారి తప్పు జరిగింది మరోసారి చేయను అంటూ సంజాయిషీ ఇచ్చారు. ఇంతకీ బండ్ల గణేష్ ఏం చేశారు అనే కదా మీ డౌట్… వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు రాంగోపాల్ వర్మ. ఈ క్రమంలోనే విడుదల చేసిన ఓ ప్రమోషన్ వీడియో కి బండ్ల గణేష్ లైక్ కొట్టాడు.

దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పవన్ అభిమానులు ఇదేంటని బండ్ల గణేష్ ను ప్రశ్నించడం మొదలు పెట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు వీడియో కి లైక్ చేసావ్ అని అభిమానులందరూ ప్రశ్నించడంతో… దీనిపై స్పందించిన బండ్లగణేష్ ఒట్టు ఏదో పొరపాటున జరిగిపోయింది.. ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయను… సారీ చెబుతున్న అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news