రియల్‌మి నుంచి మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..!

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి భార‌త మార్కెట్‌లో రియ‌ల్‌మి 6ఐ పేరిట మ‌రో బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల గేమ్స్‌ను స్మూత్‌గా ఆడుకోవ‌చ్చు. 6 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగాపిక్స‌ల్ మోనో సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

realme 6i smart phonel launched in india

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌కు సైడ్‌లో ఇచ్చారు. దీని వ‌ల్ల ఫోన్‌ను కేవ‌లం 0.29 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. మెమొరీ కార్డు, రెండు సిమ్ కార్డుల కోసం మొత్తం 3 వేర్వేరు స్లాట్ల‌ను ఇచ్చారు. 4300 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఉంది. దీనికి 30 వాట్ల ఫ్లాష్ చార్జ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల ఫోన్ కేవ‌లం 55 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది.

రియ‌ల్‌మి 6ఐ స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్
* 2400 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి90టి ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్
* 64జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 4300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 30 వాట్ల ఫ్లాష్ చార్జ్

రియ‌ల్‌మి 6ఐ స్మార్ట్‌ఫోన్ ఎక్లిప్స్ బ్లాక్‌, లూనార్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.14,999గా ఉంది. వీటిని జూలై 31వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి వెబ్‌సైట్ల‌లో కొన‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news