లోకేష్‌ పాదయాత్రపై బండ్ల గణేష్‌ సెటైర్లు !

-

నారా లోకేష్‌ పాదయాత్రపై బండ్ల గణేష్‌ సెటైర్లు వేశారు. 200 కిలోమీటర్లు కూడా పాదయాద్ర చేయని లోకేష్‌.. 2000 కిలో మీటర్లు చేయడం చాలా బాగుందన్నారు బండ్ల గణేష్‌. నేను ఈరోజు 2000 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర పూర్తి చేస్తున్నానని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఇది దూరం మాత్రమే కాకుండా, ఇది ఆంధ్రప్రదేశ్ యువత కలలు, ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రయాణం కొనసాగించాను.

Bandla Ganesh Satires on Lokesh Padayatra
Bandla Ganesh Satires on Lokesh Padayatra

నాతో చేరిన వారందరికీ ధన్యవాదాలు, కలిసి మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని కోరారు లోకేష్‌. అయితే.. లోకేష్‌ ట్వీట్‌ పై బండ్ల గణేష్‌ స్పందించారు. నిజంగా నేను మీరు 200 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేయరు అనుకున్నా ఏదో ఒక సాపు చెప్పి ఆపేస్తారని ఊహించుకున్నానంటూ చురకలు అంటించారు. కానీ నేను అనుకున్నది తప్పు… చాలా ఆనందం ఇచ్చింది మీరు 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం, నాకు మీ పార్టీతో సంబంధం లేదు కానీ మీరంటే అభిమానం ఆల్ ది బెస్ట్ మిస్టర్ లోకేష్ అంటూ పోస్ట్‌ చేశారు బండ్ల గణేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news