దర్శి రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది : నారా లోకేష్

-

దర్శి రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ నేత నారా లోకేష్. ప్రకాశం జిల్లా దర్శి సమీప సాగర్ కాల్వలో ఆర్టీసీ బస్సుపడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. మృతులకు అశ్రు నివాళులు. పొదిలికి చెందిన పెళ్లి బృందానికి జరిగిన ప్రమాదం మాటలకు అందని విషాదమని తెలిపారు లోకేష్‌. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలవాలని కోరారు నారా లోకేష్.

అటు..ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయిందని, ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news