హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో సౌత్ ఇండియా టూర్.. ఎంచక్కా ఈ ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు..!

-

దక్షిణ భారతదేశం లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు ని ఈ టూర్ ప్యాకేజీ ద్వారా చూసి వచ్చేయచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలు ని చూడాలనుకునే భక్తులకు ఇదే గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం ఎన్నో ప్యాకేజీలని తీసుకు వస్తోంది. సౌత్ ఇండియా టెంపుల్ రన్ అనే పేరు తో ఈ ప్యాకేజీ ని తీసుకొస్తోంది. భక్తుల్ని ఫ్లైట్‌ లో తీసుకెళ్లి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను ఈ ప్యాకేజీ లో చూపిస్తారు.

ఇక ఈ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే… కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తిరుచ్చిరాపల్లి, త్రివేండ్రం వంటివి ఈ ప్యాకేజీ లో వున్నాయి. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఆగస్ట్ 13న ఈ టూర్ ప్యాకేజీ స్టార్ట్ కానుంది. సౌత్ ఇండియా టెంపుల్ రన్ టూర్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది. మొదటి రోజు హైదరాబాద్‌ లో ప్రారంభం అవుతుంది. ఉదయం 5.15 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లయిట్. ఉదయం 6.50 గంటలకు త్రివేండ్రం రీచ్ అవుతారు.

హోటల్ కి వెళ్ళాక నేపియర్ మ్యూజియం, పూవర్ ఐల్యాండ్, అజిమల శివాలయం చూసి రాత్రి త్రివేండ్రమ్‌లో బస చేయాలి. రెండో రోజు శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి వెళ్ళాలి. తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి. కన్యాకుమారి లో సన్‌సెట్ పాయింట్‌లో సూర్యాస్తమయాన్ని చూడొచ్చు. రాత్రికి కన్యాకుమారిలో ఉండాలి. మూడో రోజు ఉదయం రాక్ మెమోరియల్ చూసి… ఆ తర్వాత రామేశ్వరం బయల్దేరాలి. రాత్రికి రామేశ్వరంలో ఉండాలి.

నాలుగో రోజు రామేశ్వరం స్థానిక ఆలయాల దర్శనం. తర్వాత ధనుష్కోడి. రాత్రికి రామేశ్వరంలో ఉండాలి. ఐదో రోజు రామేశ్వరంలో అబ్దుల్ కలాం మెమొరియల్ చూడవచ్చు. తర్వాత తంజావూర్ బయల్దేరాలి. బృహదీశ్వర ఆలయము చూడవచ్చు. తిరిగి తిరుచ్చి బయల్దేరాలి. రాత్రికి తిరుచ్చిలో ఉండాలి. ఆరో రోజు ఉదయం శ్రీరంగం చూసాక మదురై బయల్దేరాలి. రాత్రికి మదురైలో ఉండాలి. ఏడో రోజు ఉదయం మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం చూడవచ్చు. ఆ తర్వాత మదురై నుంచి హైదరాబాద్ బయల్దేరాలి. మదురైలో రాత్రి 6.50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ వచ్చేయచ్చు. పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూడండి.

 

Read more RELATED
Recommended to you

Latest news