బ్రేకింగ్ : ఈడి కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఇవాళ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈడీ విచారణ కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణ లో భాగంగా పూరీ జగన్నాథ్‌ ఇవాళ ఉదయం ఈడీ కార్యాలయానికి రాగా… దాదాపు ఎనిమిది గంటలుగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యం లోనే ఈడీ కార్యాలయానికి టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్ చేరుకున్నారు.

ప్రస్తుతం ఈడీ కార్యాలయం లోనే పూరి కుమారుడు ఆకాష్ పూరి, సోదరుడు సాయిరాం శంకర్, అడిటర్ సతీష్ ఉన్నారు. ఈ నేపథ్యం లో బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి చేరుకోవడం తో అందరూ షాక్‌ కు గురయ్యారు. అయితే… ఈడీ కార్యాలయానికి రావడం పై బండ్ల గణేష్ కూడా క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్ కేసు లో ఈడీ అధికారులు.. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. విచారణ లో ఉన్న పూరి జగన్నాథ్ ను కలవడానికి ఈడీ కార్యాలయానికి తాను వచ్చానని క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్‌ కేసులో తనకు ఎందుకు నోటీసులు ఇస్తారని మండిపడ్డారు.