ఇలా అనుసరిస్తే పిల్లల్లో మానసిక సమస్యలు వుండవు..!

-

శారీరకంగా పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మానసికంగా కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. పిల్లల్లో ఒత్తిడి తగ్గాలన్నా.. మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా.. డైలీ రొటీన్ తప్పక ఉండాలని సైకాలజిస్ట్ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి డైలీ రొటీన్ అలవాటు చేయాలి. దీనితో సమయాన్ని కూడా సరిగ్గా వినియోగించుకోవడానికి అవుతుంది. అలానే ఒత్తిడి తగ్గుతుంది. పైగా వాళ్ల పై వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

kids
kids

చాలా మంది పెద్ద వాళ్ళు వాళ్ళ యొక్క పనులతో ఎంతో బిజీగా ఉంటారు. దీనితో పిల్లలు వాళ్లకి నచ్చినట్లుగా వుంటారు. దీనితో సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేరు. దీని వల్ల పిల్లలపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అయితే మీ పిల్లలు సరిగ్గా సమయాన్ని వినియోగించుకుని… వాళ్లని వాళ్లు అభివృద్ధి చేసుకోవాలి అంటే డైలీ రొటీన్ బాగా ఉపయోగపడుతుంది.

కాబట్టి మీ సమయంలో కాస్త సమయాన్ని వాళ్లతో గడపండి. పిల్లలు వాళ్ళ యొక్క ఆక్టివిటీస్ ని ఆసక్తిగా చేసేటట్టు చూడండి. పెయింటింగ్ వేయడం వంటివి పిల్లలకు ఎంతో ఇష్టం. అలా వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ ని వాళ్ళతో పాటు మీరు కూడా చేయండి. ఇలా చేస్తే ఒత్తిడి కూడా దూరమవుతుంది. అదే విధంగా ఆటలాడడం, గార్డెనింగ్ లేదా డాన్స్ చేయడం ఇటువంటివి చేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే పిల్లల్లో మానసిక ఆరోగ్యం బాగుంటుంది. దీనితో మానసిక సమస్యలు కూడా లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఒత్తిడి లేకుండా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news