తెలంగాణ కరోనా అప్డేట్… కొత్తగా 338 కేసులు

తెలంగాణలో కరోనా విలయతాండవం రోజు రోజుకు తగ్గు ముఖం పడుతోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,58,054 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3873 మంది కరోనా మహమ్మారి తో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 5,864 గా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,48,317 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 364 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.50 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 74, 207 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,46,33,646 కు చేరుకుంది. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కేసులు… ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం శుభసూచకం.