నటీనటులు: సూర్య, సయేషా సైగల్, ఆర్య, బొమన్ ఇరానీ, మోహన్ లాల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎంఎస్.ప్రభు
మ్యూజిక్: హరీష్ జైరాజ్
నిర్మాతలు: లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: కెవి.ఆనంద్
రిలీజ్ డేట్: 20 సెప్టెంబర్, 2019
పరిచయం
తమిళ స్టార్ హీరో సూర్య, లెజెండ్ యాక్టర్ మోహన్ లాల్, ఆర్య, ఆర్య భార్య సయేషా సైగల్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ బందోబస్త్. కోలీవుడ్‌లో కాప్పన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఇదే రోజు అక్కడ కూడా రిలీజ్ కాగా… తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ చేశారు. రంగం ఫేం కెవి.ఆనంద్ దర్శకత్వం వహించడంతో పాటు టీజర్లు, ట్రైలర్లు యాక్షన్ మోడ్‌లో ఉండడంతో బందోబస్త్ మీద తెలుగులోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
భారతదేశ ప్రధానమంత్రి ( మోహన్ లాల్ ) ఒక ఉగ్రవాదుల దాడిలో చనిపోతారు. ఈ కేసు వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవడానికి పర్స్నల్ సెక్యూరిటీ ఆఫీసర్ కదీర్ (సూర్య)ను నియమిస్తారు. ఈ కేసు వెనక ఉన్న వాళ్ల గురించి తెలుసుకుంటున్న క్రమంలో ఎవ్వరూ ఊహించని విషయాలు బయటకు వస్తుంటాయి. ప్రధానమంత్రి మర్డర్ వెనుక ఇంకా చాలా ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయని తెలుసుకుంటాడు. అయితే ఈ కేసుకు బొమన్ ఇరానీ, ఆర్యకు ఉన్న సంబంధం ఏమిటి ? ఈ కేసు వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు ? వారిని సూర్య పట్టుకున్నాడా లేదా ? అన్నది చూడాలి.
కథా విశ్లేషణ…
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బందోబస్తు సినిమాలో భారీ తారాగణం ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్టాఫ్ లో ప్రధానమంత్రిపై జరిగిన హత్యకు పన్నే కుట్రలో వాటి నుంచి ఆయనను తప్పించేందుకు ఆర్య, రైతుగా ఉన్న సూర్య చేసిన ప్రయత్నాలు ఎలివేట్ చేశాడు దర్శకుడు ఆనంద్. ఫస్టాఫ్ మొత్తం సూర్య చేసే ఇన్వెస్ట్ గేటివ్ సీన్స్ తో పాటు కథనం కూడా చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌ని సైతం ఒక ఫ్లోలో స్టార్ట్ చేసిన దర్శకుడు ఆ వెంటనే కథనాన్ని బాగా స్లో చేశాడు. ఇక సెలవు ఇక ప్రీ క్లైమాక్స్‌లో సినిమాలో కథ చుట్టూ అల్లుకున్న రహస్యం ఏమిటన్నది రివీల్ అయ్యేటప్పుడు వచ్చే సీన్లు సూపర్బ్‌గా డిజైన్ చేసుకున్నాడు. ఇక సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీరియస్‌గా యాక్షన్ సీన్లతో మూవ్ అవుతూ ఉంటుంది. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ ఆశించే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. బట్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం మైండ్‌బ్లాక్ అయ్యేలా తెరకెక్కించాడు ఆనంద్.
నటీనటులు & సాంకేతికత
ప్రధాన మంత్రి పాత్రలో మోహన్ లాల్ యాక్టింగ్ బాగుంది. ఆర్య చాలా సింపుల్ పాత్రలో నటించినా ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సూర్య వన్ మ్యాన్ షోతో సినిమా అంతా తానై నడిపించాడు. మామూలు రైతు నుంచి ప్రధాన మంత్రి సెక్యురిటీ ఆఫీసర్‌గా సూర్య చూపించిన పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది. హీరోయిన్‌గా సయెషా పర్వాలేదనిపించింది. ముఖ్య పాత్రలో నటించిన సముద్రఖణి యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్‌గా చూస్తే ఎంఎస్.ప్రభు సినిమాటోగ్రఫీ సినిమాను లావిష్‌గా చూపించింది. హరీష్ జైరాజ్ పాటలు ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం మెప్పించింది. సీన్లను బాగా ఎలివేట్ చేసింది. లైకా ప్రొడక్షన్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు కేవి.ఆనంద్ విషయానికి వస్తే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన బందోబస్త్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోవచ్చు. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా యాక్షన్ డోస్ ఎక్కువైపోయింది.
సినిమా అంతా యాక్షన్‌తో నింపేశాడు. ఇంతమంది స్టార్స్‌ను వాడుకన్నా వారిని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. కాస్త ఎంటెర్టైనమెంట్ పాళ్ళు ఏమి లేకుండా సీరియస్ గా ఎలాంటి కామెడీ లేకపోవడం అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు
ప్లస్‌లు (+) :
– సూర్య – మోహన్ లాల్ నటన
– యాక్షన్ సీన్లు
– ఇంటర్వెల్ ట్విస్ట్
– హరీష్ జైరాజ్ నేపథ్య సంగీతం
మైనస్‌లు (-) :
– సీరియస్ గా సాగే కథనం
– పాటలు
– ప్లాట్ నెరేషన్
ఫైనల్‌గా..
ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్
బందోబస్త్ రేటింగ్: 2.5 / 5