టైటిల్: గద్దల కొండ గణేష్
బ్యానర్: 14 రీల్స్ ఎంటర్‌టైనర్
నటీనటులు: వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, అథర్వ్
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయనాంక బోస్
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
దర్శకత్వం: హరీష్ శంకర్
సెన్సార్ రిపోర్ట్: యు / ఏ
రన్ టైం: 170 నిమిషాలు
రిలీజ్ డేట్: 20 సెప్టెంబర్, 2019
పరిచయం:
టాలీవుడ్‌లో వరుణ్‌తేజ్ స్టైలే వేరు. కథల ఎంపికతోపాటు కనిపించే లుక్‌లోనూ ఎంతో కొత్తదనం, భిన్నత్వం చూపిస్తాడు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఆయన చేసిన ప్రయోగాలే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. క్లాస్, మాస్ కలబోతగా ఆయన సినీ ప్రయాణం సాగుతోంది. ఇక తాజాగా.. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం వాల్మీకి. ఇందులో వరుణ్‌తేజ్ లుక్‌తోనే ప్రేక్షకులను కట్టిపడేశాడు. అంచనాలను అమాంతంగా పెంచేశాడు. తమిళంలో జిగర్తాండకు రిమేక్‌గా ఈ సినిమాను తెరెక్కించారు. అయితే.. పలు కారణాల వల్ల విడుదలకు ఒకరోజు ముందు ఈ సినిమా పేరును గద్దలకొండ గణేష్‌గా మార్చారు. ఈ సినిమా సినిమా ప్రేక్షకులను ఏమేరకు అందుకుందో సమీక్షలో తెలుసుకుందాం..
కథ :
ఇక కథలోకి వెళ్దాం… వరుణ్‌తేజ్ లుక్‌తోనే మనం గుర్తుపట్ట వచ్చు.. ఇది పాతతరం గ్యాంగ్‌స్టర్ కథ అని. ఇందులో గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్) పెద్ద గ్యాంగ్‌స్టర్. ఈ క్రమంలో దర్శకుడిగా మారేందుకు అభిలాష్(అథర్వ) పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాను ఎలాగైనా ఏదో ఒకరోజు పెద్ద డైరెక్టర్‌గా మారి చూపిస్తానంటూ ఛాలెంజ్ చేసి ఇంటి నుంచి బయటకు వస్తాడు. అయితే.. ఈ క్రమంలో ఓ గ్యాంగ్‌స్టర్ కథను తెరకెక్కించాలని అనుకుంటాడు. దీంతో గ్యాంగ్‌స్టర్ గద్దలకొండ గణేష్‌ను ఫాలో అవుతాడు. గద్దల కొండ గణేష్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారుతాడు..? ఆయనతో అభిలాష్ సినిమా తీస్తాడా.. తీయడా..? పూజాహెగ్డె పాత్ర ఏమిటి..? వరుణ్, పూజాల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది..? తదితర ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే మరి.
కథా విశ్లేషణ…
ఎంచుకున్న కథను ఉన్నది ఉన్నట్టు తెరపై చూపించడంలో దర్శకుడు హరీశ్‌శంకర్ కొంత తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ కొంత స్లోగా మూవ్ అయినా… సెకండాఫ్‌లో మాత్రం ఫరవాలేదని చెప్పొచ్చు. ఇక ఎమోషనల్ సీన్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండిఉంటే సినిమా రేంజ్ అమాంతంగా పెరిగిపోయేది. అయితే.. ఇదే సమయంలో వరుణ్‌తేజ్‌ను మాస్‌లుక్‌లో చూపించిన తీరు మాత్రం హైలెట్‌గా నిలిచిపోతుంది. ఆయన డైలాగ్స్, చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే.. సినిమా నిడివి పెద్దగా ఉండడం, కొంత స్లోగా మూవ్ కావడం వల్ల ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఇక పూజా, వరుణ్ ల మధ్య మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగానే పండింది. అలనాటి గోల్డెన్ హిట్ సాంగ్ “ఎల్లువొచ్చి గోదారమ్మ”పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
నటీనటులు & సాంకేతికత :
ఈ సినిమా మొత్తానికి వరుణ్‌తేజ్ సూపర్బ్ అని చెప్పొచ్చు. పాతతరం గ్యాంగ్‌స్టర్‌గా ఆయన మాస్ లుక్, డైలాగ్స్, వేరియేషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కేవలం వరుణ్‌తేజ్ లుక్ కోసమే సినిమాకు వెళ్లొచ్చనడంలో అతిశయం లేదు. ఇక పూజాహెగ్డె కూడా తన పాత్రకు న్యాయం చేసింది. తక్కువ సీన్లలో కనిపించినా.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక మిక్కీ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా ఉంటుంది. ఆయనంక బోస్ అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్‌గా ఉంది. ఇక మిగతా నటీనటులు కూడా వారివారి పాత్రలను న్యాయం చేశారు. మొత్తంగా గద్దలకొండ గణేష్ పాత్రలో మాత్రం వరుణ్‌తేజ్ తన సత్తాచాటి.. మరోసారి తన ప్రత్యేకతను చూపించాడు.
ప్లస్‌లు.. మైనస్‌ల విషయానికి వస్తే..
మాస్ లుకింగ్‌లో వరుణ్‌తేజ్ పెర్పామెన్స్, సినిమాటోగ్రఫీ… వరుణ్ – పూజ కెమిస్ట్రీ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. మాస్‌ను మెప్పించే ఎలివేషన్ సీన్లు బాగున్నాయి. మాస్‌ను మెప్పించే ఐటెం సాంగ్‌తో పాటు ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్‌లో పూజాహెగ్డే అందాలు సూపర్బ్. ఇక మైనస్‌ల విషయానికి వస్తే కీలకమైన అథర్వ పాత్ర తేలిపోయింది. ఈ పాత్ర డిజైన్ సరిగా లేదు. పూజా హెగ్డే పాత్ర కూడా ఎక్కువుగా లేదు. ఇక ఎమోషన్ల విషయంలో హరీష్ శంకర్ తేలిపోయాడు. అనవసరమైన అరుపులు,కేకలే కాకుండా ఏకంగా 170 నిమిషాల రన్‌టైంతో పలు సీన్లు సాగదీ….సినట్టు ఉంటాయి. ఎడిటింగ్ లోపాలు చాలానే ఉన్నాయి. క్లైమాక్స్ కూడా సాగదీసిన ఫీలింగ్ ఎక్కువుగా ఉంది.
ఫైనల్‌గా…
గద్దల కొండ గణేష్ గ్రామీణ గ్యాంగ్ స్టర్ కథ. కథ విలక్షణమైన మాస్ యాంగిల్లో కనిపించినప్పటికీ, దీనికి విస్తృత వ్యవధి ఉంది. వరుణ్ తేజ్ తన మొదటి సారిగా మాస్‌లో బాగా మెప్పించాడు. ఇక సినిమా రన్ టైం రెండు గంటల యాభై నిమిషాలు ఉండడం మైనస్. చాలా చోట్ల సాగదీత ఉండడం… హరీష్ శంకర్ ఎమోషన్లు క్యాప్చర్ చేయకపోవడం… క్లైమాక్స్ బాగా సాగదీసినట్టు ఉండడం ఇబ్బందిగా ఉన్నా… వరుణ్ మాస్ యాక్టింగ్, పూజ హెగ్డేతో పాటు సాంకేతిక అంశాలు ప్లస్. ఓవరాల్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ గా ఈ సినిమా ఉంటుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలా సక్సెస్ అవుతుందో ? చూడాలి.