ఈ రోజు నుండి బాంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ల మధ్యన మూడు వన్ డే లు మరియు రెండు టీ 20 లు సిరీస్ జరగనుంది. అందులో భాగంగా మొదటి వన్ డే లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. బదులుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో పూర్తిగా తేలిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 43 ఓవర్ లకు కుదించగా బంగ్లా కేవలం 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్ లో తౌహీద్ హృదయ్ మాత్రమే అర్ద సెంచరీ చేశాడు.. మిగిలిన వారెవరూ సరిగా ఆడలేదు. ఇక బౌలింగ్ లో ఫరూఖీ 3 వికెట్లతో రాణించగా, రషీద్ ఖాన్ 2 వికెట్లతో బంగ్లాను అడ్డుకున్నాడు. మాములుగా బంగ్లాకున్న బ్యాటింగ్ బలంతో కనీసం 250 పరుగులు చేయాల్సింది. అయితే మూకుమ్మడిగా బ్యాట్స్మన్ అంతా ఫెయిల్ అవ్వడంతో ఆ మాత్రం స్కోర్ కె పరిమితం అయ్యారు.
ఛేజింగ్ లో ఆఫ్ఘన్ ను నిలువరించి సొంత గడ్డపై విజయాన్ని అందుకుందా తెలియాలంటే ఛేజింగ్ ముగిసే వరకు ఆగాల్సిందే.