బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా నేటి నుండి నాలుగు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన షేక్ హసీనా కు ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ తో సమావేశం అవుతారు. 2019 తర్వాత మొదటిసారి ఆమె భారత దేశంలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె భారత ప్రధాని మోదీతో సమావేశమై ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం, ప్రాంతీయ సుస్థిరత, పెండింగ్ లో ఉన్న సాధారణ ద్వైపాక్షిక సమస్యలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం దృశ్య తమ దేశ ఫారెక్స్ నిలువలు స్థిరీకరించుకునేందుకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ( ఐఎంఎఫ్) వద్ద రుణం కోసం ప్రయత్నిస్తోంది.
ఇందుకు ముందుగా భారత్, బంగ్లా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇరుదేశాల మధ్య 19అలాగే ఇరుదేశాల మధ్య 1965 కంటే ముందు ఉన్న రైలు మార్గాల పునరుద్ధరణ, పద్మా బ్రిడ్జి కనెక్టివిటీ తదితర అంశాలపై చర్చించనున్నారు.